ఓటు హక్కు వచ్చింది... నవ్యాంధ్రలో ఉండవల్లి వాసులుగా చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి!

  • ఇంటి నంబర్ 3-781/1లో ఓటర్లుగా నమోదు
  • తాజా జాబితాలో అందరి పేర్లూ
  • ఉండవల్లి వాసుల హర్షం
గుంటూరు జిల్లా ఉండవల్లి ఓటర్లుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడి కుటుంబం నమోదు పూర్తయింది. విభజన తరువాత నవ్యాంధ్రకు వచ్చి, ఉండవల్లి కరకట్టపై ఉన్న భవనాన్ని నివాసంగా మార్చుకుని చంద్రబాబు పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాడేపల్లి మండలం, ఉండవల్లిలో తమను ఓటర్లుగా చేర్చాలని చంద్రబాబు కుటుంబం దరఖాస్తు కూడా చేసుకుంది. సీఎంతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి పేర్లను ఇంటి నంబర్ 3-781/1లో ఉంటున్నట్టు నమోదు చేసి, ఓటరు లిస్టులోకి ఎక్కించారు. కాగా, సీఎం ఫ్యామిలీ తమ గ్రామంలో ఓటేయనున్నారని తెలుసుకున్న ఉండవల్లి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Undavalli
Chandrababu
Nara Lokesh
Brahmani
Bhuvaneshwari
Voters

More Telugu News